Home

»

Latest News

`హిప్పీ`తో స్టెప్పులేస్తోన్న శ్ర‌ద్దా!!

Apr 2, 2019 12:51PM

 

`ఆర్ ఎక్స్ 100` సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ‌. ఈయ‌న ప్ర‌స్తుతం `హిప్పీ` చిత్రంలో న‌టిస్తున్నాడు. టిఎస్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రజంట్ ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు జ‌రిగింది. అయితే ఆర్ ఎఫ్ సిలో వేసి ప‌బ్ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన హాట్ హాట్ ఐట‌మ్ సాంగ్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ పాట‌లో కార్తికేయ‌తో క‌లిసి హాట్ గాళ్ శ్ర‌ధ్దా దాస్ చిందులేస్తోంది. ఈ సినిమాలోకే హైలెట్ గా నిల‌వ‌నుంద‌ట ఈ ఐట‌మ్ సాంగ్. ఈ పాట‌లో శ్ర‌ద్ధాదాస్ త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకోనుంద‌ట‌. మ‌రో రెండు రోజుల్లో ఈ పాట పూర్త‌వుతుంద‌ట‌. ఇటీవ‌ల విడ‌ద‌లైన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆర్ ఎక్స్ తో ఆక‌ట్టుకున్న కార్తికేయ మ‌రోసారి హిప్పీతో యూత్ కి మరింత చేరువ‌వుతాడంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com