
`సైరా` విషయంలో రామ్ చరణ్ , సురేందర్ రెడ్డికి మధ్య ఇటీవల చిన్న విభేదాలు వచ్చాయని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ డిలే కావడం కానీ, బడ్జెట్ విషయంలో కానీ రామ్ చరణ్ చాలా అసంతృప్తితో ఉన్నాడట. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అవ్వదేమో అన్న టెన్షన్ తో పాటు అనుకున్న బడ్జెట్ కు మించి పోవడంతో చరణ్ చాలా టెన్షన్ పడుతున్న తెలుస్తోంది. ఈ విషయమై ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు డైరక్షన్ టీమ్ ని పిలిచి కాస్తి సీరియస్ గానే మాట్లాడినట్లు వినికిడి.
ప్రారంభ దశలో 150 కోట్లతో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు పైగా మించి పోవడంతో ..రిస్క్ చేస్తున్నామా? ఏంటన్న ఆలోచనలో పడిపోయాడట చరణ్. ఇప్పటికే రీ షూట్స్ కూడా చాలా జరిగాయట. ఈ విషయంలో దర్శకుడుకు, నిర్మాతకు మధ్య విభేదాలు రావడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఖర్చుతో పాటు ఆలస్యం అవుతున్నా కూడా క్వాలిటీ విషయంలో మాత్రం చరణ్ హ్యాపీగానే ఉన్నాడట. ఇప్పటి వరకు చేసిన అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని సమాచారం. ఇప్పటికి 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరాకు వస్తుందా? రాదా? అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ఏది ఏమైనా మేలో షూటింగ్ పూర్తి చేయాలని చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డికి డెడ్ లైన్ పెట్టాడట. మరి అప్పటి వరకు సురేందర్ రెడ్డి షూటి్ంగ్ కంప్లీట్ చేస్తాడో లేదో చూడాలి మరి. తాజా షెడ్యూల్ లో కన్నడ నటుడు సుదీప్ పాల్గొన్నాడు. ఇటీవలే అమితా బచ్చన్ పోర్షన్ కంప్లీట్ అయింది.






