Home

»

Latest News

న‌టుడు మోహ‌న్ బాబుకు ఏడాది జైలు శిక్ష‌!!

Apr 2, 2019 3:13PM

 

సినీ న‌టుడు, నిర్మాత మోహ‌న్ బాబుకు హైద‌రాబాద్ లోని ఎర్ర‌మంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2010లో సినీ ద‌ర్శ‌కుడు వై వియ‌స్ చౌద‌రి  40 ల‌క్ష‌ల చెక్ బౌన్స్ కు సంబంధించి కోర్టుకెళ్లారు.  ఇందుకు గానూ మంగ‌ళ వారం కేసు విచార‌ణ చేప‌ట్ట‌గా మోహ‌న్ బాబుకు  కోర్టు ఆఖ‌రి తీర్పు వెలువరుస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది.  ఇందులో ఏవ‌న్ గా ఉన్న ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ కు ప‌దివేల జ‌రిమానా, ఏటు గా ఉన్న మోహ‌న్ బాబు కు ఏడాది జైలు శిక్ష‌తో పాటు వైవీయ‌స్ కు 41 ల‌క్ష‌ల డెబ్భైఐదు వేలు చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది.
 
గ‌తంలో వైవీయ‌స్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు హీరోగా  `స‌లీం` సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా గానూ మోహ‌న్ బాబు వైవీయ‌స్ కు చెక్ ఇచ్చారు. అయితే  ఆ చెక్ చెల్ల‌క‌పోవడంతో ఆయ‌న కోర్టుకెళ్లారు. అప్ప‌టి నుంచి విచార‌ణ జ‌రుగుతూనే ఉంది. దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత ఈ రోజు కోర్టు తీర్పు వెల్ల‌డిస్తూ మోహ‌న్ బాబుకు శిక్ష ఖ‌రారు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే మోహ‌న్ బాబు బెయిల్ క్కూడా ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.  ఇటీవ‌లే మోహ‌న్ బాబు వైసీపీ లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com