
సినిమా చూసి ఎమోషనల్ అవ్వడం కామనే. కానీ ఓ సినిమా చూసి రాత్రంతా నిద్రపట్టలేదని, కన్నీళ్లు వచ్చాయని ఓ స్టార్ స్వయంగా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చూసిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. కుటుంబ బంధాలు, వయసు తేడా ప్రేమ కథ, జీవితంలో రెండో అవకాశం వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది.
ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా చూసిన శివరాజ్‌కుమార్.. తన అనుభూతిని పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత దాదాపు గంటసేపు నిద్రపోలేకపోయానని చెప్పారు. మంచంపై పడుకుని సినిమా గురించి ఆలోచిస్తూ ఉండిపోయానని.. కన్నీళ్లు కూడా వచ్చాయని తెలిపారు.
అంతేకాదు.. ఈ సినిమా తన తల్లిదండ్రులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ రాజ్‌కుమార్‌తో పాటు తన కుటుంబాన్ని గుర్తు చేసిందని శివరాజ్‌కుమార్ చెప్పారు. సినిమాలోని భావోద్వేగాలు తనలో ఎన్నో పాత జ్ఞాపకాలను మేల్కొలిపాయని ఆయన వెల్లడించారు.
కొన్ని భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేమని చెప్పిన శివరాజ్‌కుమార్.. ఇలాంటి లోతైన భావోద్వేగాలు ఉన్న సినిమాను తాను కూడా భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక సినిమా సూపర్ స్టార్ ను ఇంతగా కదిలించిందంటే.. అందులోని ఎమోషన్ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ సూర్య అభిమానులు ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు.
ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్'లో సుబ్బు.. జాన్వీ కపూర్ చేసుంటే మామూలు రచ్చ కాదు.!
[Shiva Rajkumar Emotional, Vishwanath And Sons OTT, Vishwanath & Sons, Shiva Rajkumar, Suriya, Venky Atluri, Mamitha Baiju, Suriya Latest Movie, Telugu Film News]






