
భారతీయ సినీ ప్రేమికులతో పాటు రామభక్తులందరు 'దివాలి' రోజున రామాయణ థియేటర్స్ లో ఉండనున్నారు. దీంతో వరల్డ్ వైడ్ థియేటర్స్ అన్ని ఈ సారి రాముని సాక్షిగా దీపపు కాంతుల్లో వెలిగిపోనున్నాయి. ఈ పౌరాణిక అద్భుతాన్ని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి చిత్ర బృందం అపూర్వమైన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.
అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన యూట్యూబ్ దిగ్గజం 'మిస్టర్ బీస్ట్' (జిమ్మీ డోనాల్డ్‌సన్) ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రమోషన్లలో భాగస్వామి కాబోతున్నారు. గ్లోబల్ డిజిటల్ మీడియా మరియు ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక కలయికగా నిలవబోతోంది. ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక స్పెషల్ ఇన్విటేషన్ పిక్ తీవ్రంగా వైరల్ అయ్యింది. ఈ ప్రత్యేక కార్యక్రమం లేదా చాట్ షోలో బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్, రాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా మెప్పించబోతున్న సహజ నటి సాయి పల్లవి, విజనరీ డైరెక్టర్ నితీష్ తివారీ, అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాలతో పాటు లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న రవి దూబే కూడా పాల్గొనబోతున్నారు.

ఇది కూడా చదవండి: కీర్తి సురేశ్ బోల్డ్ డ్రామా చేసేస్తారా :ఆ విషయంలో మొదటి చిత్రం ఇదే!
యూట్యూబ్‌లో ఏకంగా 518 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు మరియు 140 బిలియన్లకు పైగా వ్యూస్ కలిగిన మిస్టర్ బీస్ట్ ఈ నటీనటులతో ముఖాముఖి సంభాషించనున్నారు. ఈ ప్రత్యేకమైన ఇంటరాక్షన్ 'రామాయణం' అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రపంచవ్యాప్తంగా లైవ్‌స్ట్రీమ్ కానుండటం విశేషం.దీంతో ఇప్పుడు రాముడు ప్రపంచ పటంపై తన 'ఆరా' సృష్టించనున్నాడు.
[Ramayana Movie Mrbeast Promotions, MrBeast Ramayana Promotions, Ramayana, Ranbir kapoor, Sai Pallavi, Nitesh Tiwari, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






