Home

»

Latest News

అనుమాన పక్షి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు: మరి డిజాస్టర్ అన్నారుగా!

Sep 26, 2026 5:44PM


డిజె టిల్లు ఫేమ్  విమల్ కృష్ణ దర్శకత్వంలో  రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, రాశి, అజయ్ కీ రోల్స్ లో నిన్న సెల్యులాయిడ్ పైకి  వచ్చిన చిత్రం అనుమాన పక్షి. అంతా కరెక్ట్ గా ఉంటేనే  ప్రస్తుత సొసైటీ అనుమానాల పెను భూతాన్ని బెల్ట్ బాంబ్ లాగా నడుముకి చుట్టుకొని తిరుగుతున్నారు. అలాంటిది అనుమాన పక్షి అని టైటిల్ పెట్టి తప్పు చేసారనే మాట అభిప్రాయాన్ని సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు సినిమా కూడా బాగోలేదనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. 


బాక్సాఫీస్ లెక్కల వివరాల్లోకి వెళితే, 'అనుమాన పక్షి'  మొదటి రోజు  భారతదేశం వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూపంలో 11.43 లక్షలు వసూలు చేసింది. అందులో నికర వసూళ్లు (ఇండియా నెట్) దాదాపు 11 లక్షల వరకు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 83 నగరాల్లో మొత్తంగా 376 షోలలో ఈ సినిమా ప్రదర్శితమవ్వగా, మొదటి రోజు సగటు ఆక్యుపెన్సీ 9.1 శాతంగా నమోదైంది. ఒక్కో స్క్రీన్ నుంచి సగటున ₹6,926 వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు అమ్ముడైన మొత్తం టిక్కెట్ల సంఖ్య 10,188 కాగా, ఉదయం షోల నుంచి రాత్రి షోల వరకు ఆక్యుపెన్సీలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు.   రీజియన్ వారీగా కలెక్షన్ల లెక్కలు పరిశీలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ భాగం వసూళ్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో 6.15 లక్షల గ్రాస్ రాగా, 144 షోలలో 10.9 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో ₹4.94 లక్షల గ్రాస్ నమోదవ్వగా, 212 షోలలో 7.8 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చింది.


ఇది కూడా చదవండి: రామాయణ ప్రమోషన్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ లెజండ్: ఆసక్తిగా మారిన ప్రమోషన్స్!

 

 

 

 ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ప్రకృతి చెప్పుకునే సినీ ఊసులుకి  లోబడి సినిమాలు తెరకెక్కించాలని మరోసారి రుజువయ్యింది.

 

[Anumana Pakshi First Day Collections, Anumana Pakshi Review, Rag Mayur, Vimal Krishna,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com