
సీనియర్ యాక్ట్రెస్ శ్రియ ప్రస్తుతం యమ బిజీగా ఉంది. బాలయ్య సరసన "గౌతమిపుత్ర శాతకర్ణి" సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని దక్కించుకొన్న శ్రియ తాజాగా తమిళంలో మరో క్రేజీ ప్రోజెక్ట్ లో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం అందుతోంది. శింబు హీరోగా "త్రిష లేదా నయనతార" ఫేమ్ ఆధిక్ తెరకెక్కించనున్న సినిమాలో శింబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా.. వారిలో ఒక హీరోయిన్ గా శ్రియను సెలక్ట్ చేసుకొన్నారట.
అయితే.. ఈ సినిమా రెగ్యులర్ ఎంటర్ టైనర్ కాదని, దర్శకుడి మునుపటి సినిమా "త్రిష లేదా నయనతార" వలె అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ అని తమిళ వర్గాల టాక్. కెరీర్ క్లోజింగ్ టైమ్ లో "అలాంటి సినిమా చేయకూడదు, ఇలాంటి సినిమా చేయకూడదు" అని రూల్స్ పేట్టుకోవడం ఎందుకు అనుకొందో ఏమో తెలియదు కానీ.. శ్రియ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట!






