Home

»

Latest News

"అకీరా" ట్రైలర్ అదిరింది!

Jul 4, 2016 5:48PM

తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన తాజా బాలీవుడ్ చిత్రం "అకీరా". బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్ నేడు విడుదలైంది. ఫాక్స్ స్టార్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి పవర్ ఫుల్ ఫైటర్ గా కనిపించనుండగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ ట్రైలర్ లో సోనాక్షి నటన పరంగానే కాకుండా ఫైట్ సీక్వెన్స్ లతోనూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంది. 
సోనాక్షి చేసిన ఫైట్ లలో.. ఆమె కుడి చేతితో ఇచ్చిన "హ్యాండ్ బ్లోస్" యాక్షన్ లవర్స్ విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. మునుపటి సినిమాల రిజల్ట్ వల్ల కాస్త జోరు తగ్గించిన సోనాక్షి.. "అకీరా' అనంతరం సూపర్ స్పీడ్ తో దూసుకుపోవడం ఖాయమని బాలీవుడ్ వర్గాలతోపాటు ట్రైలర్ చూసినవాళ్ళందరూ విశ్లేషిస్తున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com