Home

»

Latest News

శ్రీకాంత్ సాహసాలు!

Jul 4, 2016 5:17PM


విలన్ గానే కెరీర్ మొదలెట్టినప్పటికీ.. తర్వాతి కాలంలో ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ దక్కించుకొన్నాడు శ్రీకాంత్. అనంతరం మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన శ్రీకాంత్ కు "ఖడ్గం" మినహా మరో హిట్ లేకుండాపోయింది. దాంతో ఇప్పుడు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తున్నాడు శ్రీకాంత్. ఇటీవలే ఓ తమిళ చిత్రంలో విలన్ గా నటించనున్న శ్రీకాంత్ ఈలోపు తన చిరకాల కోరికైన రోడ్ ట్రిప్ ను పూర్తి చేయాలనుకొన్నాడట. 
తన చిన్ననాటి స్నేహితులు నలుగురుతో కలిసి శ్రీకాంత్ జున్ 17న హిమాలయాలకు రోడ్ ట్రీప్ బయలుదేరి పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టి వచ్చారు. అతి ప్రమాదకరమైన ఘాట్ రోడ్‌లో శ్రీకాంత్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం సాగించారు. మోటర్ వాహనాల ద్వారా ప్రయాణం చేయగల ప్రపంచంలోని ఎత్తైన ( 18380 అడుగులు) ప్రదేశం ఖర్దుంగ్లాను శ్రీకాంత్ మిత్ర బృందం దర్శించింది. అదే దారిలో సెకండ్ హయ్యెస్ట్ పాస్ ఆఫ్ ద వరల్డ్ టగ్లాంగలానూ వీరు చూసొచ్చారు. లడక్ నుండి లే కు వెళ్ళి... అక్కడ నుండి మనాలి మీదగా హైదరాబాద్ చేరారు. శ్రీకాంత్ చేసిన ఈ డేంజరస్ రోడ్ ట్రిప్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com