రజనీకాంత్ మట్టికి ఉన్న విలువ మీకు తెలుసా
on Feb 15, 2025
'రజనీ కాంత్' (Rajinikanth) హీరోగా వచ్చిన ఎన్నో హిట్ సినిమాల్లో 1990 లో వచ్చిన 'అతిశయ పైరవి'(Athisaya piravi)కూడా ఒకటి. చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన యముడికి మొగుడు సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి ఎస్ పీ ముత్తు రామన్ దర్శకత్వం వహించగా,రజనీ సరసన కనకతో పాటు'షీబా ఆకాష్ దీప్'(Sheeba Akashdeep)నటించింది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో షీబా ఆకాష్ దీప్ మాట్లాడుతు 'అతిశయ పైరవి' మూవీ షూటింగ్ లో రజనీ గారి క్రేజ్ చూసి నేను షాక్ అయ్యాను.తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే లొకేషన్ కి ఆయన కోసం కొన్ని వేల మంది అభిమానులు భారీ పూలదండలతో వచ్చి భక్తితో ఆయనకి వేసేవారు.కొంత మంది ఆయన నడిచే దారిలోని మట్టిని సేకరించి దాన్ని పవిత్రంగా భావించే వారు.ఆ సినిమా తర్వాత నేను రజనీ గారిని కలిసింది చాలా తక్కువ.కాకపోతే కొన్ని రోజుల క్రితం ఒక ఫంక్షన్ లో కలిసాను.ఆయన నన్ను గుర్తుపట్టి నా యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు.'అతిశయ పైరవి' షూటింగ్ అప్పుడు కూడా నాలో ఉన్న భయాన్ని పోగొట్టి,నటనకి సంబంధించిన ఎన్నో సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.
'అతిశయ పైరవి' తోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన షీబా ఆ తర్వాత హిందీలో ఏ ఆగ్ కబ్ భుజేగి, బారిష్,ప్యార్ కా సాయ,సూర్య వంశీ ఇలా సుమారు 30 సినిమాల దాకా చేసింది.2023 లో రణవీర్ సింగ్,అలియా భట్ జంటగా వచ్చిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని'సినిమాలో మోనా సేన్ క్యారక్టర్ లో అధ్బుతంగా నటించింది

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
