శర్వానంద్ సిల్వర్ జూబ్లీ సినిమా ఎవరితో..?
on Apr 22, 2016

కెరీర్ కాస్త డల్ గా మొదలైనా, ఆ తర్వాత వరస హిట్ సినిమాలతో మంచి ఊపు తెచ్చుకున్నాడు శర్వానంద్. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. చాలా మందికి తెలియని విషయమేంటంటే, శర్వానంద్ 24 సినిమాలు పూర్తి చేసేసి, ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సినిమాకు రెడీగా ఉన్నాడు. తన కెరీర్లో ల్యాండ్ మార్క్ అయిన ఈ ఫిల్మ్ ను అత్తారింటికి దారేది నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారని అనౌన్స్ కూడా అయిపోయింది. కానీ దర్శకుడు ఎవరు అన్నది ఇప్పటి వరకూ చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం, శర్వానంద్ సిల్వర్ జూబ్లీ సినిమాను ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ కు అసోసియేట్ గా పనిచేసిన చంద్రమోహన్ ను డైరెక్టర్ గా తీసుకున్నారట. ఇంతకు ముందు కరుణాకరన్ ప్రభాస్ తో తీసిన డార్లింగ్ సినిమాకు అసోసియేట్ గా పనిచేశాడు. ఆ సినిమాకు కూడా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత కావడం విశేషం. చంద్రమోహన్ చెప్పిన కథ శర్వాకు విపరీతంగా నచ్చేయడంతోనే తన ల్యాండ్ మార్క్ ఫిలిమ్ అతనితో చేస్తున్నాడట. ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాల్ని త్వరలోనే అఫీషియల్ గా ప్రకటిస్తామంటున్నారు మూవీ టీం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



