
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంకర్` రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా యమా ఫాస్ట్ గా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను వారణాసి లో ప్లాన్ చేసారు. ఈ రోజు నుంచి కాశీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఢిఫరెంట్ లుక్ తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేగ్, డైలాగ్ డెలివరీతో రామ్ `ఇస్మార్ట్ శంకర్ ` సినిమాలో కనిపించనున్నాడు. ఇక పూరి జగన్నాథ్ , రామ్ కలయికలో వస్తోన్న తొలి సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ పరంగా కూడా క్రేజ్ బాగున్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరులో రిలీజ్ చేయడానికి పూరి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.






