Home

»

Latest News

నేను హ్యాపీగా రొమాన్స్ చేసుకొంటాను!

Jul 9, 2016 12:12PM


కేవలం బాలీవుడ్ కు మాత్రమే కాదు ఇండియన్ సినిమాలో "రొమాన్స్" అనగానే గుర్తుకొచ్చేది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్. నవరసాలనూ అద్భుతంగా పలికించగలిగే నటుడే అయినప్పటికీ.. శృంగార రసాన్ని మాత్రం బాగా పండిస్తుంటాడు షారుక్. అందుకే ఆయన్ని 50 ఏళ్ళ వయసులోనూ రోమాంటిక్ స్టార్ అనే పిలుచుకొంటుంటారు. అందుకే.. షారుక్ కూడా నేను హ్యాపీగా రొమాన్స్ చేసుకొంటాను.. వాళ్ళని మల్లాయుద్ధం చేయనివ్వండి అంటూ చమత్కరించాడు. 
ఇటీవల ఈద్ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన షారుక్ ఖాన్.. "సల్మాన్, అమీర్ లు "మల్లయుద్ధం నేపధ్యంలో సినిమాలు చేస్తున్నారు కదా మీరు కూడా చేస్తారా? అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "నేను రొమాన్స్ పండించడంలో నిష్ణాతుడ్ని అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా.. సో, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను యుద్ధాలు, మల్లయుద్ధాలు చేయనివ్వండి.. నేను హ్యాపీగా రొమాన్స్ చేసుకొంటాను" అంటూ సమాధానమిచ్చాడు! 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com