
"తను చిన్న పిల్ల.. తన తమ్ముడితో సరదాగా ఆడుకుంటూ దిగిన ఫోటోను మీడియా వారు అసహ్యకరంగా చిత్రీకరిస్తుండడం ఏమాత్రం సమంజసం కాదు" అంటూ మీడియాపై మండిపడ్డాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్. ఆయన ముద్దుల కుమార్తె "సుహానా" ఇటీవల సెలవుల్లో సాగర తీరాన బికినీ ధరించి.. తమ్ముడితో ఆడుకొంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దాంతో చాలా వెబ్ సైట్లలో "షారుక్ కూతురు బికినీ ఫోటోలు" అనే పోస్ట్ లు దర్శనమిచ్చాయి. ఈ విషయమై షారుక్ ఘాటుగా స్పందించాడు. చిన్నపిల్లల చేష్టలను కూడా విపరీత బుద్ధులతో చూడడం సరికాదని చెప్పాడు షారుక్.
అలాగే.. "సుహానా నా కూతురు కాబట్టి ఆమె సరదాగా దిగిన ఫోటోలను కూడా వెబ్ సైట్లలో పెట్టి హల్ చేస్తున్నారు. అదే వేరేవాళ్లు అంతకంటే బరితెగించిన ఫోటోలు దిగినా పాటించుకోరు. నా స్టార్ డమ్ నా పిల్లలకు సమస్యగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు" అంటూ తండ్రిగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు షారుక్ ఖాన్!






