Home

»

Latest News

ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్లతో రవితేజ!

Jul 4, 2016 11:47AM


"బెంగాల్ టైగర్" అనంతరం ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా ఫైనల్ చేయకుండా.. మొదలుపెట్టిన ఒక్క సినిమా కూడా సెట్స్ కు వెళ్లకుండానే ఆపేసి కథలు వింటూ కూర్చున్నాడు మాస్ మహారాజా. చక్రి దర్శకత్వంలో "రాబిన్ హుడ్" అనే సినిమా త్వరలోనే ప్రారంభంకానుందని వార్తలొచ్చినప్పటికీ.. అది కూడా అటకెక్కేసినట్లేనని వినికిడి. 
తాజా సమాచారం ప్రకారం రవితేజ రెండు కథలు ఒకే చేశాడని తెలుస్తోంది. తనకు "వీర" లాంటి డిజాస్టర్ ఇచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా.. అలాగే "పవర్" లాంటి ఎబౌ యావరేజ్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రవితేజ అంగీకారం తెలిపాడట. 
"సర్దార్ గబ్బర్ సింగ్" అనంతరం బాబీ, "అబ్బాయితో అమ్మాయి" అనంతరం రమేష్ వర్మ దర్శకులుగా బాగా డీలాపడి ఉన్నారు. ఈ ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్లనూ ఎంకరేజ్ చేస్తున్న రవితేజ ఈ ఇద్దరు ఎటువంటి విజయాన్ని అందిస్తారో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com