శంభో శంకరకు కలెక్షన్ల జోష్.. అంత సీన్ ఉందా!
on Jul 2, 2018

కమేడియన్ షకలక శంకర్ హీరోగా కొత్త అవతారమెత్తిన చిత్రం ‘శంభో శంకర’. ఈ చిత్రానికి చాలా ముందు నుంచే భీభత్సమైన ప్రొమోషన్లు ఇచ్చారు. రివ్యూలు మాత్రం అతి సాధారణంగానే వచ్చాయి. కమెడియన్ శంకర్‌ను కొత్త పాత్రలో చూడటం కాస్త కష్టంగా ఉందన్న విమర్శలూ వినిపించాయి. కానీ చిత్రబృందం మాత్రం ఇవేవీ పట్టించుకుంటున్నట్లు లేదు. మూడో రోజే సినిమా అదిరిపోయిందంటూ సక్సెస్ మీట్ నిర్వహించేశారు. ‘పెద్ద హీరోలు చేసినట్లే తను కూడా చేసే ప్రయత్నం చేశానని... ఇక ముందు కూడా అంతే నమ్మకంగా సినిమాలు తీస్తానని’ షకలక శంకర్ ఈ మీట్‌లో వాక్రుచ్చారు. ఇక నిర్మాతలు కూడా ఏం తగ్గలేదు. మొట్టమొదటి రోజే ఈ సినిమా రెండు కోట్లకి పైమాటే వసూలు చేసిందని ఏకంగా ఓ పోస్టరే రిలీజ్ చేశారు. దానికింద ‘ఈ కలెక్షన్ల సునామీని ఎవరూ ఆపలేరు...’ అనే ట్యాగ్ లైన్ ఒకటి! కొంతమంది లెక్కల ప్రకారం శంభో శంకర మొదటిరోజు వసూల్లు 90 లక్షల దాటలేదట. మరి ఈ బిల్డప్ ఏమిటో! ఎవరి మాట నమ్మాలో తెలియడం లేదు. బహుశా టాలీవుడ్‌లో ఇదో కొత్త ట్రెండ్ కాబోలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



