వెబ్ సిరీస్‌తో షాలిని రి-ఎంట్రీ?
on Nov 22, 2020

మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో బాలనటిగా అలరించిన షాలిని.. ఆపై కథానాయికగానూ తనదైన ముద్ర వేశారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందిన తమిళ సినిమా 'అలై పాయుదే' (తెలుగులో 'సఖి')తో పాటు మలయాళ చిత్రం 'నిరమ్' ('నువ్వే కావాలి' మాతృక).. షాలినికి నాయికగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగనే.. కోలీవుడ్ స్టార్, తన సహ నటుడు అజిత్‌ని ప్రేమ వివాహం చేసుకున్న షాలిని.. పెళ్ళి తరువాత నటనకు విరామమిచ్చారు.
కట్ చేస్తే.. దాదాపు 20 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత షాలిని రి-ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే ఈ సారి సినిమాతో కాదు.. ఓ వెబ్ సిరీస్‌తో షాలిని సందడి చేయనున్నారట. అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో షాలిని ఈ సిరీస్ ఆఫర్‌ని కాదనలేకపోయారట. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. రి-ఎంట్రీలో షాలిని ఏ మేరకు అలరిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



