ఓర్నీ... షకీలానీ వదలరా..??
on Mar 7, 2018

బయోపిక్‌ల హంగామా మొదలైంది. సినిమావాళ్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఇలా అందరి జీవిత కథల్నీ తెరకెక్కిస్తున్నారు. తెలుగునాట సావిత్రి, ఎన్టీఆర్, పుల్లెల గోపీచంద్ సినిమాలు బయోపిక్‌లుగా వస్తున్నాయి. ఇప్పుడు షకీలా జీవిత కథనీ బయోపిక్‌గా తీస్తున్నారు. 1990 - 1995 మధ్య కాలంలో మలయాళ పరిశ్రమని ఒక ఊపు ఊపేసింది షకీలా. ఆమె నటించిన బీ గ్రేడ్ సినిమాలు మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలకు పోటీగా విడుదలయ్యేవి. షకీలా సినిమా వస్తోందంటే బడా హీరోలు సైతం ఒణికి పోయేవారు. ఆయా సినిమాలన్నీ అనువాదాలుగా తెలుగుకీ వచ్చాయి. ఆ తరవాత షకీలా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు షకీలా కథని సినిమాగా తీస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళ నటి రిచా చందా షకీలా పాత్ర పోషిస్తోంది. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. షకీలా సినిమా వస్తోందంటేనే ఆ కాలంలో కుర్రాళ్లంతా వెర్రెక్కిపోయేవాళ్లు. ఇప్పుడు షకీలా జీవితమే సినిమాగా వస్తోందంటే ఆగుతారా..?? మరి ఈసినిమాని ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో..??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



