Home

»

Latest News

షాహిద్ ను బయపెట్టే కూతురి ప్రశ్న...

Nov 6, 2016 4:44PM

 

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే తండ్రి అయిన సంగతి తెలిసిందే. వీరికి ముద్దుల కూతురు పుట్టగా.. తనకి మిషా అని పేరు పెట్టారు. మిషా అంటే షాహిద్ కపూర్, మీరా దంపతులు ఇద్దరి పేర్ల కలయిక. మీరా లోని మీ, షాహిద్ లోని షా అక్షరాలు కలిపి పాపకు మిషా అని పేరు పెట్టారు. కూతురుతో సమయం గడపాలని, చిన్నారితో ఆటలాడాలని కొన్నిరోజులు షూటింగ్స్ నుంచి ఈ హీరో విరామం తీసుకున్నాడు. అయితే ఈమధ్య ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కపూర్ తన కూతురి గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆశ్చర్యకమైన సమాధానం చెప్పారు. చిన్నారి మిషా ఏదో ఒకనాడు మీ వద్దకు వచ్చి 'నాన్నా నేను నటి అవుతానంటే మీరు ఎలా ఫీలవుతారు' అన్న ప్రశ్నకు స్పందించిన షాహిద్... అది చాలా కష్టతరమైన పని.. నిజంగానే తన కూతురు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మాత్రం చాలా భయపడతానని అన్నాడు. మరి చూడబోతే షాహిద్ తన కూతురిని సినీ పరిశ్రమకు మాత్రం తీసుకురానట్టే తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com