Home

»

Latest News

మెగా భ‌జ‌న ఆఫ్ ది ఇయ‌ర్ ఇదేనేమో..??

Nov 7, 2016 9:28AM

అటు చిరంజీవినీ, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని పొగిడేస్తూ త‌మ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు వాటినే ప్ల‌స్ పాయింట్స్ గా వాడుకొనే హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు చాలామందిని చూసింది తెలుగు చిత్ర‌సీమ‌. బండ్ల గ‌ణేష్ లాంటి వాడు ఈ విష‌యంలో దిట్ట అనిపించుకొన్నాడు. నితిన్ ప‌వ‌న్‌ని పొగిడినా.. అది హ‌ద్దుల్లోనే ఉండేది. చిన్నా చిత‌కా హీరోలు ఎవ‌రు ప‌డితే వాళ్లు, ఎప్పుడు ప‌డితే అప్పుడు ప‌వ‌న్ భ‌జ‌న చేస్తున్న‌వాళ్లే. అయితే వాళ్లంద‌రినీ... ఆ మాట‌కొస్తే బండ్ల గ‌ణేష్ అంత‌టోడ్నీ మించిపోయేవాడు ఒక‌డొచ్చాడు.. త‌నే స‌ప్త‌గిరి.

 క‌మెడియ‌న్‌గా స‌ప్త‌గిరి మ‌హా బిజీ. రోజుకు ల‌క్ష ఇచ్చుకొనే రేంజ్‌. ఇప్పుడు హీరోగా మారిపోయి స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథిగా వ‌చ్చాడు. ప‌వ‌న్‌ని మెప్పించి ఈ కార్య‌క్ర‌మానికి ర‌ప్పించ‌డంలోనే స‌ప్త‌గిరి తెలివితేట‌లు భారీ స్థాయిలో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆడియో వేడుక‌క‌లో సప్త‌గిరి ఇచ్చిన స్పీచ్ చూస్తే.. మెగా భ‌జ‌న‌గాళ్ల‌కు కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయిడం ఖాయం. ఆ రేంజులో వేసుకొన్నాడు స‌ప్త‌గిరి.

చిరంజీవిని చూస్తూ పెరిగాన‌ని, మ‌న‌సులో ఆయ‌న‌తో ల‌క్ష‌ల సార్లు మాట్లాడాన‌ని చిరుని తెగ పొగిడేశాడు స‌ప్త‌గిరి. ఆ త‌ర‌వాత ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. ప‌వ‌న్ సినిమా టికెట్ల కోసం క్యూలో నిల‌బ‌డి చొక్కాలు చించుకొన్న రోజులు గుర్తున్నాయ‌ని, ప‌వ‌న్ త‌న‌కు ఓ ప‌సిపిల్లాడిలా.. ప్ర‌పంచాన్ని మార్చి వేసే యోగిలా క‌నిపిస్తాడ‌ని... భ‌లే భ‌లేగా డ‌బ్బా కొట్టాడు. ప‌వ‌న్ పిలుపు ఇస్తే.. ఓ అభిమానిగా స్పందించ‌డానికి ఆయ‌న వెంట న‌డ‌వ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని ప‌వ‌న్‌కి జై కొట్టాడు.

స‌ప్త‌గిరి స్పీచూ.. అందులో ఆవేశం, అభిమానం చూస్తే.. మెగా భ‌జ‌న ఆఫ్ ది ఇయ‌ర్ ఇదేనేమో అనిపించ‌క‌మాన‌దు. స‌ప్త‌గిరి స్పీచ్‌కి ప‌వ‌న్ పొంగిపోయాడో... లేదంటే ఇదంతా నాకు మామూలేగా అనుకొన్నాడో తెలీదుగానీ.. స‌ప్త‌గిరి మాట్లాడుతున్నంత సేపూ ముసి ముసిగా న‌వ్వుతూనే ఉన్నాడు. మొత్తానికి స‌ప్త‌గిరి స్పీచ్ అయితే మెగా ఫ్యాన్స్‌కి అందునా ప‌వ‌న్ అభిమానుల‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. సో.. వాళ్ల ఓటు.. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌కే అన్న‌మాట‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com