Home

»

Latest News

ఐష్ సినిమాపై నోరు విప్పిన అభిషేక్..

Nov 6, 2016 1:19PM

 

ఎన్నో వివాదాల అనంతరం విడుదలైన  ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  అయితే అందరి ప్రశంసలు అందుకున్న ఈసినిమాపై మాత్రం ఇంత వరకూ బచ్చన్ ప్యామిలీ పెదవి విప్పలేదు. అంతేకాదు గత కొద్ది కాలంగా బచ్చన్ ప్యామిలీలో ఏదో జరుగుతుందన్న ప్రచారం కూడా  జోరుగా జరుగుతోంది. దానికి తోడు బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా చూడకపోవటం, సినిమాపై కామెంట్ చేయకపోవటంతో ఈ వాదనకు మరింత బలాన్ని ఇచ్చినట్టయ్యింది. అయితే ఇప్పుడు ఈ వివాదాలకు చెక్ పెడుతూ.. అభిషేక్ బచ్చన్ నోరు విప్పారు.  తాను తన ఫుట్ బాల్ టీం పర్యటనలతో బిజీగా ఉన్న కారణంగా సినిమా చూడలేకపోయానని, అయితే ప్రొడక్షన్ టైం లోనే కొంత సినిమా చూశానని.. ఈ సినిమాలో ఐష్ లుక్ స్టన్నింగ్గా ఉంది..అద్భుతంగా నటించిందని తెలిపాడు. మరి ఇప్పుడైనా గాసిప్స్ కు తెరపడుతుందా..? లేదా..? చూద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com