సూర్య మూవీ విషయంలో తప్పు చేశా.. చాలా రిగ్రెట్ ఫీలయ్యా!
on Apr 27, 2025
టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్స్ లో మొదట వినిపించే పేరు శేఖర్ మాష్టర్. ఈయన బిగ్ స్క్రీన్ మీద కొరియోగ్రాఫ్ చేస్తే బుల్లితెర మీద డాన్స్ షోస్ కి జడ్జ్ గా చేస్తూ ఉంటాడు. ఈయన కొరియోగ్రాఫ్ చేసిన కొన్ని సాంగ్స్ మీద ఈ మధ్య బాగా నెగటివిటీ పెరిగింది. అలాగే తన లైఫ్ లో ఒక రిగ్రెట్ కూడా ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
"నా జీవితంలో రిగ్రెట్స్ అనేవి లేవు కానీ ఒక్కసారి షూటింగ్ కి లేట్ గా వెళ్లాను. అప్పుడు మాత్రం చాలా రిగ్రెట్ ఫీలయ్యా. ఆ రోజు చెన్నైలో సూర్య సర్ చేస్తున్న "సూరారై పోట్రు" మూవీ షూటింగ్ జరుగుతోంది. అదే తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో వచ్చింది. సూరారై పోట్రు మూవీకి సుధా కొంగర గారు డైరెక్టర్ గా చేస్తున్నారు. నేను అప్పుడే మార్నింగ్ ఫ్లయిట్ దిగి వెళ్తున్నాను 6 కి అనుకుంటా షాట్ అన్నారు. సరే 6 అంటే అదే టైంకి స్టార్ట్ చేయరులే 7:30 కి అలా ఉంటుందిలే అనుకుని నేను 6:15 కి వెళ్ళా. కానీ నేను వెళ్లే సమయానికి హీరో సూర్య సర్ వచ్చేసి రెడీగా ఉన్నారు. మరోవైపు కెమెరా కూడా రెడీగా ఉంది, సుధా కొంగర మేడం కూడా రెడీగా ఉన్నారు. వాళ్లందరినీ చూసి నేను షాకయ్యా. అసలు వీళ్లంతా ఎప్పుడు వచ్చి ఉంటారు. ఎప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంటారు అనుకుని నేను చాలా రిగ్రెట్ ఫీలయ్యా. ఇంకోసారి వాళ్ళు చెప్పిన టైంకి అరగంట ముందే షూటింగ్ స్పాట్ లో ఉండాలి కానీ మిస్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఎప్పుడూ లేట్ గా వెళ్ళను..కానీ ఆ టైములో ఎందుకో టైర్డ్ అయ్యి ఒక 15 నిమిషాలు లేట్ గా వెళ్లాను." అని చెప్పాడు శేఖర్ మాష్టర్.
"నాకు ఒక ఇద్దరు ముగ్గురు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళే వచ్చి సాంగ్ చేయమని అడిగితే ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా వాళ్ళతో కలిసి పని చేసాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా నా పనే మాట్లాడుతుంది." అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
