పారితోషకం విషయంలో నేను చాలా నష్టపోయాను..నాగార్జున, ధనుష్ అభిమానుల వెయిటింగ్
on Jun 18, 2025

దర్శకుడిగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula)ది ఒక విభిన్నశైలి. ఆయన తెరకెక్కించిన ఆనంద్, గోదావరి, లీడర్, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ వంటి పలు చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ నెల 20 న పాన్ ఇండియా మూవీ 'కుబేర' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. పైగా తన కెరీర్ ని ప్రారంభించి ఇరవై ఐదు వసంతాలు అవుతుంది. దీంతో కుబేర రిలీజ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా తన కెరీర్ లో 'కుబేర'(Kuberaa)నే తొలి పాన్ ఇండియా మూవీ. పైగా తొలి సారిగా నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)వంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేస్తుండంతో కుబేర పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఇద్దరి అభిమానులు కూడా మూవీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
కుబేర ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ కమ్ముల రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకున్న ఆర్ధిక పరిస్థితి, నేపధ్యం ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తాను. ఒకప్పుడు స్నేహితులందరి దగ్గర డబ్బులు తీసుకొని సినిమాలు నిర్మించేవాడ్ని.సినిమాల పరంగా బాధ అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం పైనా, మనుషులపైన ఎక్కువ అంచనాలు పెట్టుకొను. నా సినిమాల విషయంలోను, లాభాల్లో నాకింత పర్శంటేజ్ కావాలని ఆశించలేదు. ఇంత పారితోషకం ఇవ్వండని అడిగి తీసుకుంటానంతే. దానివల్ల చాలా నష్టపోయాను. అయినా నాకు ఆ విషయంలో బాధ లేదు. ఎందుకంటే ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం.
కుబేర చిత్రం చూసి ప్రేక్షకులు సిల్వర్ స్క్రీన్ పై చూసిన తర్వాత ఇలాంటి ప్రపంచం కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు.అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక కుబేర లో రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చెయ్యగా, జిమ్ సర్బ్, దిలీప్ తాలి, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు తో కలిసి శేఖర్ కమ్ముల నే ఈ చిత్రాన్ని నిర్మించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు అందర్నీ అలరిస్తున్నాయి.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



