ENGLISH | TELUGU  

ఆ సన్నివేశాల్లో రాత్రిపూట నగ్నంగా నటించా.. అప్పుడు భయపడ్డా!

on Nov 2, 2023

'మాఊరి పొలిమేర' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'మా ఊరి పొలిమేర 2. అనిల్ విశ్వనాథ్ ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. రేపు(నవంబరు 3న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా  గురువారం నటుడు సత్యం రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించాడు. ఆ విశేషాలివి. 

చాలా సినిమాల మధ్య విడుదలవుతోంది. ఒత్తిడి ఏమైనా ఉందా?
అలాంటిదేమీ లేదు. పార్ట్ 1 చూసిన  ఆడియన్స్ మా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మా సినిమాకు ప్రత్యేకమైన ఆడియన్స్ వున్నారు. మాకు అదే ధైర్యం. 

మొదటిభాగంతో పొల్చితే రెండవభాగం మేకింగ్ పరంగా రిచ్ గా వుంటుందా? 
మొదటిభాగంలో మాకు బడ్జెట్ పరిమితులు ఉన్నాయి. చాలా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తిచేశాం. కానీ రెండోభాగం ప్రారంభానికి ముందే దీనిని చాలా ఖర్చుతో, అనుకున్న లోకేషన్స్ ల్లో ఖర్చుకు వెనుకాడకుండా  చిత్రీకరణ చేద్దాం అనుకున్నాం. అదే విధంగా రిచ్ గా, క్వాలిటీ మేకింగ్ లో చిత్రీకరణ చేశాం. 

మొదటిపార్ట్ చిత్రీకరణ అప్పుడే పార్ట్ 2 వుందని అనుకున్నారా? 
అనుకున్నాం. కానీ పార్ట్ 1కు వచ్చిన స్పందనను బట్టి చేద్దాం అనుకున్నాం. సో పార్ట్ 1కు అనూహ్య స్పందన రావడంతో ధైర్యంగా పార్ట్ 2 మొదలుపెట్టాం. 

మీ పాత్ర కొత్తగా వున్నట్లు అనిపిస్తుంది? 
నేను మొదట్నుంచీ కూడా కొత్త పాత్రలు చేయాలని అనుకునే వాడిని. ఆ తరహా లోనే నా సినిమాల ఎంపికలు వుండేవి. నటుడిగా ప్రూవ్ చేసే ఎలాంటి పాత్రలు చేయడానికి కైనా రెడీగా వుండేవాడిని. పొలిమేర లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. 

రెండో భాగంలో మీ పాత్రలో మళ్లీ ట్విస్టులు వుంటాయా? 
తప్పకుండా మిమ్ములను షాకింగ్ కు గురిచేసే ట్విస్టులు వుంటాయి. అవి మీకు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. 

మొదటి పార్ట్ చూడకపోయినా రెండో పార్ట్ అర్థం అవుతుందా? 
దర్శకుడు కథను అలాగే రాసుకున్నాడు. పార్ట్ 1 చూస్తే సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. చూడకపోయినా పార్ట్ 2 నచ్చుతుంది. పార్ట్ 1 చూడనివాళ్లకు అర్థమయ్యేలా రెండోభాగం ప్రారంభంలో రీక్యాప్ వేస్తున్నాం. 

ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరు భయపడ్డరా? 
పార్ట్ 1 చేస్తున్నప్పుడు భయపడ్డాను. ఫారెస్ట్ లో, రాత్రి పూట స్మశానంలో చేతబడుల సన్నివేశాలకు భయపడ్డాను. చాలా ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఈ సినిమాల్లో సన్నివేశాల డిమాండ్ మేరకు నేను న్యూడ్ గా కనిపిస్తాను. ఏదైనా సినిమా కోసమే. ఇలాంటి అరుదైన అవకాశం అందరికి రాదు.

మీరు చేసిన పాత్రకు ఏమైనా రిఫరెన్స్ వుందా? 
రియల్ లైఫ్ లో నాకు తెలిసి చేతబడులు చేసిన వాళ్లు ఎవరూ మనకు తారసపడరు. అందుకే ఈ పాత్ర కోసమే ఈ విషయాలు తెలుసుకుని నటించాను.

సెన్సార్ సర్టిఫికెట్ ఏ గ్రేడ్ వచ్చింది? 
మాకు ముందే తెలుసు. అనుకున్నట్లే ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఎందుకంటే మా సినిమా అంతే భయంకరంగా వుంటుంది. చాలా ఒళ్లు గగుర్పొడించే సన్నివేశాలు వుంటాయి. 

పొలిమేర 3లో కూడా మీరు నటిస్తారా? 
ఒకే కథ కాబట్టి నాకు తెలిసి పొలిమేర 3 లో కూడా నేనే వుంటాను. 

హీరోగా కంటిన్యూ చేస్తారా? 
నేను హీరో కాదు. కేవలం ఆర్టిస్ట్ ని మాత్రమే. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనేది నా తపన. కేవలం హీరోగానే చేస్తానని అనడం లేదు. చిన్న కాన్సెప్ట్లతో వ్వ్ వచ్చిన సినిమాల్లో లీడ్ పాత్రలు చేస్తాను. 

మీ 20 ఏళ్ల కెరీర్ ఎలా వుంది? 
పెద్డగా సాధించిదేమి లేదు. కళ్లు మూసి తెరిచేలోగా 20 ఏళ్లు అయిపోయింది. డిఫరెంట్ పాత్రలు చేయాలని, నాకు నేను కొత్తగా కనిపించాలనే తపనతో కొనసాగుతున్నాను. కేవలం ఇలాంటి పాత్రలే చేయాలని నియమాలేమీ పెట్టుకోలేదు. 

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 
ఈ సినిమా తరువాత కొంత గ్యాప్  తీసుకుందామని అనుకుంటున్నాను. నా లైఫ్ లో పొలిమేర 2 పెద్ద విషయం. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు. గీతాంజలి , బాలకృష్ణ గారి సినిమా, మట్కా చిత్రాల్లో పెద్ద పాత్రలు చేస్తున్నాను. టెనెంట్ అనే సినిమాలో నేను లీడ్ రోల్ గా చేస్తున్నాను. నా కెరీర్ లో టెనెంట్ కూడా గొప్ప సినిమా అవుతుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.