Home

»

Latest News

స్టార్ కమెడియన్స్ మల్టీస్టారర్.. క్రేజీ కాంబోలో 'రంగబలి' దర్శకుడి కొత్త సినిమా షురూ!

May 11, 2026

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న నటులు సత్య (Satya), యోగిబాబు (Yogi Babu). ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తుండటం విశేషం. 'రంగబలి' సినిమాతో నవ్వులు పూయించిన దర్శకుడు పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రేజీ ఎంటర్టైనర్ నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

సత్య ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిపోయాడు. రీసెంట్ గా 'జెట్లీ'తో హీరోగానూ అవతరించాడు. మరోవైపు యోగిబాబు కూడా తమిళంలో స్టార్ కమెడియన్ గా క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరు కామెడీ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లలో నవ్వుల వర్షం కురియడం ఖాయమని చెప్పవచ్చు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తున్నారు.

నేడు చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఒక విభిన్నమైన కథాంశంతో, ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా సాగనుందని సమాచారం. 

'రంగబలి' సినిమాలో సత్య కామెడీ ఎంతలా హైలైట్ అయిందో తెలిసిందే. మూవీ రిజల్ట్ ఎలా ఉన్న, సత్య కామెడీకి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సత్యకు యోగిబాబు తోడవ్వడంతో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందనే ఆసక్తి నెలకొంది.  

నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'లవ్ స్టోరీ' ఫేమ్ పవన్ సి.హెచ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com