
డింపుల్ హయతి(Dimple Hayathi).. ఈ పేరు చెబితే చాలు ఎన్నో స్పెషల్ సాంగ్స్ తో పాటు రవితేజ(Raviteja)చేసిన కొన్ని సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రవితేజ భర్త మహాశయులకులో కూడా జత కట్టింది. ఇప్పుడు ఈ భామకి సంబంధించిన తాజా అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ న్యూస్ ఏంటో చూద్దాం
శర్వానంద్(Sharwanand)సంపత్ నంది(Sampath Nandi)కాంబోలో వస్తున్న మూవీ భోగి. ఈ మూవీలో డింపుల్ హయతి కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. మేకర్స్ రీసెంట్ గా డింపుల్ హయతి లుక్ ని రివీల్ చేసారు. రెడ్ శారీ ధరించి చేతిలో విసన కర్ర పట్టుకొని ఉన్న ఆమె లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. 'ప్రపంచానికి ఆమె సౌందర్యం కావాలి. కానీ ఆమె మనసుని ఎవరు అర్ధం చేసుకోరు' అనే క్యాప్షన్ తో డింపుల్ ఎలాంటి క్యారక్టర్ లో చేస్తుందో అర్ధమవుతుంది. 'మందారం'గా డింపుల్ బోల్డ్ అండ్ రగ్డ్ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. "నా బొడ్డులో ప్రపంచం, చల్ తీ! మందారం ఈడ" అని ఆమె చెప్పిన డైలాగ్ కూడా ఆమె క్యారక్టర్ యొక్క యాటిట్యూడ్ అని అర్ధమవుతుంది.
also read: Tollywood trending: ఈ రోజు టాలీవుడ్ ట్రెండింగ్ లో హెడ్ లైన్స్
1960ల నాటి తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న బోగీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తుంది. ఆమె క్యారక్టర్ పేరు 'కందుల సులోచన రాణి'. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టు 28, 2026న భోగిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.ఇటీవలే రాజమండ్రి పరిసరాల్లోని అడవుల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లని చిత్రీకరించారు.







