
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' (Peddi) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మే 18న విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో 'పెద్ది' మేనియా మొదలైంది. (Peddi Movie Trailer)
సాధారణంగా రామ్ చరణ్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. కానీ 'పెద్ది' విషయంలో ఆ లెక్క వేరేలా ఉంది. చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా మలిచారని తెలుస్తోంది. మే 18న రాబోతున్న ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం ఖాయమంటున్నారు.
'పెద్ది'లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో రామ్ చరణ్ మ్యానరిజమ్స్, డైలాగ్స్, విజువల్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనో.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతకుమించి అనేలా ఉండబోతుందని టాక్.
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ఇప్పుడు 'పెద్ది'తో ఆయన తన మాస్ పవర్ ఏంటో మరోసారి నిరూపించుకోబోతున్నారు. మే 18న విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.





.webp)

