లావణ్య త్రిపాఠి కొణిదెల కొత్త చిత్రం.. ఒకటే నవ్వులు
on Jul 29, 2025

'అందాల రాక్షసి' తో సినీ రంగ ప్రవేశం చేసిన 'లావణ్య త్రిపాఠి కొణిదెల'(Lavanya Thripathi)ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు, వంటి హిట్ చిత్రాలు లావణ్య ఖాతాలో ఉన్నాయి. వరుణ్ తేజ్(Varun Tej)తో వివాహం అయిన తర్వాత నటనకి దూరంగా ఉన్న లావణ్య ఇప్పుడు ‘సతీ లీలావతి’(Sathi Leelavathi)అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవ్ మోహన్(Dev MOhan)హీరోగా చేసాడు.
రీసెంట్ ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్‌ను గమనిస్తే లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. కానీ నెక్ట్స్ సీన్‌లోనే దేవ్ మోహన్‌ని లావణ్య కొట్టి కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో మనం గమనించవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.
గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య(Tatineni Satya)దర్శకత్వం వహిస్తున్నారు. మాటలు: ఉదయ్ పొట్టిపాడు, ఆర్ట్: కోసనం విఠల్, పి.ఆర్.ఓ : మోహన్ తుమ్మల.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



