
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక మంచి అలవాటుంది. తన వల్ల ఎవరైనా నష్టపోతే, మళ్ళీ తానే స్వయంగా ఆ నష్టాన్ని పూడ్చుతాడు. అప్పట్లో "తీన్ మార్" సినిమా తీసి దారుణంగా నష్టపోయిన బండ్ల గణేష్ కు "గబ్బర్ సింగ్" సినిమా ఇచ్చి, అతడ్ని టాప్ ప్రొడ్యూసర్ ను చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే తరహాలో.. "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మరాఠీ నటుడు శరద్ కేల్కర్ కు ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ లభించలేదు. దాంతో.. పవన్ కల్యాణే స్వయంగా పిలిచి మరీ తన తాజా చిత్రం "కడప కింగ్" (వర్కింగ్ టైటిల్)లో మెయిన్ విలన్ గా కాదుగానీ, ఓ కీలకపాత్రలో నటించే అవకాశాన్నిచ్చినట్లు సమాచారం. మరి శరద్ కేల్కర్ అదృష్టం రెండోసారైనా తనకు విజయాన్ని దక్కిస్తుందో లేదో చూడాలి!
.jpg)




.jpg)

