Home

»

Latest News

టాలీవుడ్ క్వీన్ "త్రిష" 

Jun 30, 2016 3:27PM

బాలీవుడ్ లో 2014లో విడుదలైన "క్వీన్" నటిగా కంగనా రేంజ్ ను ఒక్కసారిగా ఆకాశానికేత్తేయడంతోపాటు బాలీవుడ్ సినిమా పరిధిని కూడా పెంచింది. వయో, వర్గ భేదం లేకుండా అందరూ "క్వీన్" చిత్రాన్ని ఆదరించారు. దాంతో సినిమా కలెక్షన్ల పరంగానూ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాను 2015లోనే తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాత త్యాగరాజ్. అయితే.. టైటిల్ పాత్రను పండించగలిగే నటి కోసం ఎదురుచూసి చూసి సమంత, నయనతార, నిత్యామీనన్ లాంటి కథానాయికలను సంప్రదించినప్పటికీ.. వారు సరిగా రెస్పాండ్ అవ్వక ప్రొజెక్ట్ ను పక్కన పెట్టేశారు. 

మళ్ళీ ఇన్నాళ్లకు "క్వీన్" రీమేక్ పట్టాలేక్కే అవకాశముందని తెలుస్తోంది. టైటిల్ క్యారెక్టర్ ను పోషించేందుకు త్రిష అంగీకరించిందని.. సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సుహాసిని సంభాషణలు సమకూర్చనుంది. వచ్చే ఏడాది ఈ రీమేక్ సెట్స్ కు వెళ్లనుంది. పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయిన అనంతరం ఓ ఆడపిల్ల పయనం ఎలా సాగింది? అనేది సినిమా కథాంశం. మరి బాలీవుడ్ జనాలు నెత్తినపెట్టుకున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com