Home

»

Latest News

ట్రైల‌ర్ రివ్యూ : స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

Nov 7, 2016 10:58AM

క‌మెడియ‌న్లు హీరోలుగా మార‌డం తేలికైన విష‌య‌మే. కానీ... హీరోగానూ హిట్లు కొట్ట‌డం, నిల‌దొక్కుకోవ‌డం క‌ష్టం. స్టార్ క‌మెడియ‌న్లు సైతం హీరోలుగా వెల‌గ‌లేక యూ ట‌ర్న్ తీసుకొని మ‌ళ్లీ కామెడీ వేషాలు వెదుక్కొన్న‌వారే. ట్రాక్ రికార్డు ఘోరంగా ఉన్నా స‌రే.. క‌మెడియ‌న్లు మాత్రం హీరోలుగా మారేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా స‌ప్త‌గిరి కూడా హీరో అయిపోయాడు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది.

ట్రైల‌ర్లో మెరుపులేం క‌నిపించ‌లేదు. ఓ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చూసిన‌ట్టే ఉంది. స‌ప్త‌గిరి కంటే.. ష‌క‌ల‌క శంక‌రే కామెడీ ఎక్కువ చేశాడ‌నిపిస్తోంది. అయితే స‌ప్త‌గిరి వేసిన స్టెప్పులు, హీరోగా ఇచ్చిన బిల్డ‌ప్పులు మాత్రం ఆక‌ట్టుకొంటాయి. చెడ్డీ మాన్ అంటూ... చివ‌ర్లో ఇచ్చిన కౌంట‌ర్ ఫన్ పండించింది. ఇలాంటి ట్రిక్కులు, పంచ్ డైలాగులు ఈ సినిమాలో ఎన్ని ఉంటే అంత మంచిది. స‌ప్త‌గిరి కూడా హీరో అనేసుకొని, ఆ స్థాయిలో విజృంభించ‌కుండా.. త‌న‌లోని క‌మెడియ‌న్‌ని పూర్తి స్థాయిలో బ‌య‌ట‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తే. స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ నాన్ స్టాప్ గా దూసుకుపోయే అవ‌కాశం ఉంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com