Home

»

Latest News

రికార్డులను తిరగరాస్తోన్న తెలుగువన్ పీకే-2

Nov 7, 2016 11:18AM


అమీర్‌ఖాన్, అనుష్కశర్మ ప్రధాన పాత్రలు పోషించిన "పీకే" మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పీకే రికార్డుల్లోకి ఎక్కింది. ఆ పీకేకు ఏమాత్రం తీసిపోకుండా అంతే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను పొందింది తెలుగువన్ పీకే-2. పీకే కలెక్షన్లలో సునామీ సృష్టిస్తే..తెలుగువన్ పీకే-2 యూట్యూబ్‌లో రెండు కోట్ల వ్యూస్‌ని క్రాస్ చేసి రికార్డుల్లోకి ఎక్కింది. పీకే సినిమాను పేరడిగా చేస్తూ 2015 జనవరిలో శ్రీకాంత్ రెడ్డి అనే కుర్రాడి దర్శకత్వంలో తెలుగువన్ పీకే-2ని రిలీజ్ చేసింది.

నవ్విస్తూనే..మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఫోకస్ చేశాడు శ్రీకాంత్. పీకేగా జయకృష్ణ, పీఎంగా రవి రాజమౌళి చక్కని హావభావాలు ప్రదర్శించారు. వాస్తవానికి ఇండియా మొత్తంగా చూసుకున్నా..ఏ షార్ట్ ఫిల్మ్ వ్యూస్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా రెండు కోట్లు దాటలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి, మరికొన్ని హిందీ సినిమాల ట్రైలర్‌లు మాత్రమే ఈ ఘనతను అందుకొన్నాయి. అవన్నీ కూడా భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నవి..కాని చాలా చిన్న బడ్జెట్‌తో, అల్రెడి హిట్ అయిన సినిమాకు పేరడిగా తెరకెక్కిన ఓ షార్ట్ ఫిల్మ్‌ను 2 కోట్ల మంది చూడటమంటే అది మామూలు విషయం కాదు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com