Home

»

Latest News

సునీల్‌కి అలీ చుర‌క‌

Nov 7, 2016 9:44AM

సుతిమెత్త‌గా మాట్లాడుతూనే చుర‌క‌లు వేయ‌డం, డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో టార్గెట్ చేయ‌డం... అలీకి అల‌వాటే. ఈమ‌ధ్య అలీ మాట‌ల్లో బూతులు త‌గ్గాయి గానీ, చుర‌కేయ‌డాలు మానేయ‌లేదు. తాజాగా సునీల్ లాంటి క‌మెడియ‌న్ల‌పై ఓ సెటైర్ వేశాడు అలీ. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫంక్ష‌న్‌కి అలీ అతిథిగా వ‌చ్చాడు. అలీ.. మాట్లాడుతున్న‌ప్పుడు అక్క‌డ సునీల్ కూడా ఉన్నాడు. హీరోలైన క‌మెడియ‌న్ల గురించి అలీ మాట్లాడుతూ... ''క‌మెడియ‌న్లు హీరోగా రాణించ‌గ‌ల‌రు. అయితే.. దాన్ని ఓ ల‌క్కీ లాట‌రీ అనుకోవాలి. లాట‌రీ ఒక్క‌సారే త‌గులుతుంది. త‌గిలాక ఆ డ‌బ్బులు జేబులో పెట్టుకొని రిలాక్స్ అయిపోవాలి. అంతేగానీ మ‌ళ్లీ మ‌ళ్లీ టికెట్ కొన‌కూడ‌దు. క‌మిడియ‌న్ పాత్ర‌లు చేసుకొంటూ వెళ్లాలి'' అని స‌ల‌హా ఇచ్చాడు.

అలీ హీరోగా మారినా క‌మెడియ‌న్ వేషాలు వ‌ద‌ల్లేదు. కానీ సునీల్ మాత్రం హీరో అయ్యాక‌.. వాటి జోలికి వెళ్లలేదు. ఆఫ‌ర్లు వ‌చ్చినా వ‌దులుకొన్నాడు. ఇప్పుడు హీరోగా హిట్లు లేవు. క‌మెడియ‌న్‌గా చేయ‌లేడు. దాన్నే ఓ ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవాల‌ని స‌ప్త‌గిరికి స‌ల‌హా ఇచ్చాడ‌న్న‌మాట‌. అలీ డైలాగుల‌న్నీ త‌న‌పై సెటైర్లే అని సునీల్‌కి అర్థ‌మైందో, లేదో??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com