‘గోదారి గట్టు’ అంటూ మరోసారి వెంకీ కోసం గళమెత్తిన రమణ గోగుల!
on Nov 30, 2024
అనిల్ రావిపూడితో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు చేసిన వెంకటేష్ తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌న ఎనౌన్స్ చేయబోతున్నారు. వెంకటేష్ యాక్షన్ సీన్స్ ఎంత బాగా చెయ్యగలరో, కామెడీ సీన్స్‌ని కూడా అంతే యాక్టివ్‌గా చెయ్యగలరు. ఇప్పటివరకు అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ మూవీస్ చాలా చేశారు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ.
ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఆల్రెడీ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘గోదారి గట్టు..’ అనే పాటను చాలా గ్యాప్ తర్వాత రమణ గోగుల పాడారు. గతంలో వెంకటేష్ ‘లక్ష్మీ’ చిత్రానికి మ్యూజిక్ చేయడంతోపాటు పాటలు కూడా పాడారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మరోసారి వెంకీ కోసం తన గళాన్ని సవరించుకున్నారు రమణ గోగుల. ఆయనతోపాటు మధుప్రియ ఈ పాటను పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. శనివారం ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘గోదారి గట్టు మీద రామ సిలకవే ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే..’ అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
