రవితేజ సినిమాలో సముద్ర కని
on Nov 7, 2019

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో పాపులర్ తమిళ నటుడు సముద్ర కని ఒక కీలక పాత్ర చేయనున్నారు. 'డాన్ శీను', 'బలుపు' మూవీల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో తయారయ్యే ఈ మూవీలో నాయికగా ఇప్పటికే శ్రుతి హాసన్ ఎంపికైన విషయం తెలిసిందే. 'బలుపు' తర్వాత రవితేజ, గోపీచంద్.. ఇద్దరితోనూ శ్రుతి రెండోసారి పనిచేస్తోంది. నటునిగా రవితేజకు ఇది 66వ చిత్రం. ఇందులో ఆయన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.
దర్శకత్వం నుండి నటన వైపు అడుగులేసి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న సముద్ర కని ఇప్పటికే తెలుగులో రాజమౌళి సినిమా 'ఆర్ ఆర్ ఆర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గోపీచంద్ చెప్పిన కథ, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాని అంగీకరించారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



