షాకింగ్ విషయాలను చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్!
on Feb 6, 2023
హీరోయిన్ సమీరా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2005లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహుడు అనే చిత్రంలో చేసింది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈమె చిరంజీవితో జై చిరంజీవ, ఎన్టీఆర్ తో అశోక్ చిత్రాలలో నటించింది. ఇక 2014లో ఈమె వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు ఆమె తల్లి. తాజాగా ఆమె కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమె బాడీ పాజిటివ్ని ప్రోత్సహిస్తూఎంతోమందికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై వీడియోలు పోస్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం తన కెరీర్ లో ఎదురైన షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఆ రోజుల్లో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో నన్ను బ్రెస్ట్ సర్జరీ చేసుకోమని చాలామంది సూచించారు. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది. చాలామంది హీరోయిన్లు బ్రెస్ట్ కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించేవారు. అదే కాకుండా గ్లామర్ గా కనిపించడం కోసం ముక్కు ఎముకల మార్పులకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునేవారు. అది గమనించి చాలామంది నన్ను అలాగే బ్రెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు. నేను మాత్రం ప్యాడ్లు వాడుతూ కవర్ చేసుకునే దాన్ని. ఏంటి ఇది ఏమైనా ఆచారమా? అని భావించిన నేను వాటిని పట్టించుకోలేదు. అందరిలా నేను సర్జరీలకు వెళ్ళలేదు. దేవుడు నాకు ఇచ్చిన బాడీ పాజిటివిటీ మీద నాకు నమ్మకముంది. దాంతో సర్జరీ అవసరం నాకు కనిపించలేదు. అందుకే నేను కొందరిలా బ్రెస్ట్ సర్జరీ చేయించుకోలేదు అని సమీరా తెలిపింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
