చెమ్మగిల్లిన కళ్ల వెనుక సమంత భావం...
on Apr 19, 2017
.jpg)
సాధారణంగా మన కళ్లను బట్టి మన మనసులోని భావాలను ఇట్టే చెప్పేయొచ్చు అంటారు. ఇప్పుడు హీరోయిన్ సమంత కూడా అదే అంటుంది. షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ ఫొటోలు కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇప్పటికే చైతు, సమంతకు సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేసిన సమంత.. ఇప్పుడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అదేంటంటే...చెమ్మగిల్లిన నయనాలతో బాధాతప్త హృదయంతో కనిపిస్తున్న తన ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ.. స్త్రీ కళ్లలోని భావాల్ని చూసి ఆమె హృదయంలో ఏముందో తెలుసుకోవడమే నిజమైన అందం అంటూ క్యాప్షన్‌ను కూడా పెట్టింది. దీంతో సమంత పెట్టిన ఈ ఫొటో ఇప్పుడు చాలా లైక్స్ సంపాదించుకుంది. అంతేకాదు సమంత కవితాత్మకమైన భావాల్ని ఆమె అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. కాగా ప్రస్తుతం సమంత..రాజుగారి గది-2 చిత్రంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



