Home

»

Latest News

లైఫ్ బోర్ కొట్టేస్తోంది..పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది-సమంత

May 22, 2016 2:49PM

వరుస సినిమాలతో యమ స్పీడు మీదున్న సమంతకు లైఫ్ బోర్ కొట్టేస్తోందట. ఈ విషయం మీడియా చెబుతున్నది కాదు. స్వయంగా సమంత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పింది. "పెళ్లి స్టేజ్ వచ్చేసింది.. ఇప్పుడింక పెళ్లి, పిల్లలతో సెటిల్ కావాలనుకుంటున్నా"..అని తన మనసులోని మాటలో బయటపెట్టింది. ప్రస్తుతం ఓ యువ హీరోతో ప్రేమాయణం నడుపుతున్న ఈ చెన్నై చిన్నది పనిలో పనిగా అతడి గురించి కూడా కొన్ని క్లూస్ ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా అతడు పరిచయం. గరిట పట్టాడంటే నలభీమపాకమే. నాన్‌వెజ్ అయితే అదుర్స్ అంతే. ఏమోషన్ ఏదైనా నేను కొంచెం త్వరగా రియాక్ట్ అవుతాను. తను నాకు పూర్తి వ్యతిరేకం. ఆలోచించి మాట్లాడతాడు, పేషన్స్‌తో ఉంటాడు. హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. అదే లేకపోతే అతడిని లవ్ చేసేదాన్నే కాదేమో అంటూ ఓ మామూలు అమ్మాయిలా సిగ్గుపడిపోయింది. ఇంకో మ్యాటరేంటంటే వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఓకే అనేశాయి..ఇక "గట్టిమేళమే". మరి అదేప్పుడంటే త్వరలోనే చెబుతా అంటోంది ఈ చిన్నది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com