Home

»

Latest News

సమంతకు మహేష్ ను చూస్తూ ఉండాలనిపించిందట..!

May 14, 2016 5:15PM

తెలుగు హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అయితే అందగాడు, హాలీవుడ్ హీరో రేంజ్ అని అనగానే మాత్రం ఫస్ట్ మహేష్ బాబు పేరే వస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఇండియా వైడ్ అమ్మాయిల ఫాలోయింగ్ లో మహేష్ కు చాలా క్రేజ్ ఉంది. మూమూలు అమ్మాయిలే కాదండీ, పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్స్ కూడా ఫ్లాటై పోతున్నారు. మహేష్ తో మూడు సినిమాలు కలిసి నటించిన సమంత కూడా ఈ లిస్ట్ లో ఉంది. నాకు మొదటి నుంచీ మహేష్ అంటే క్రష్. కానీ బ్రహ్మోత్సవంలోని ఒక పాటలో అయితే, ఆయన నుంచి చూపు తిప్పుకోలేకపోయాను అని చెబుతోంది. సూపర్ స్టార్ అంటే నాకు రోజురోజుకూ ఇష్టం పెరిగిపోతుంది. బ్రహ్మోత్సవం షూటింగ్ టైంలో అయితే ఒక పాట షూట్ చేస్తున్నప్పుడు ఆయన్ను అలా చూస్తూ ఉండాలనిపించింది అని సమంత క్లియర్ గా చెప్పేస్తోంది. సమంత అంటోందని కాదు గానీ, మహేష్ సినిమా సినిమాకూ మరింత అందంగా మారుతున్నాడన్నది మాత్రం వాస్తవం. ముఖ్యంగా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో సూపర్ స్టార్ గ్లామర్ భీభత్సంగా ఉంది. ఇంత మందిని మహేష్ ఫ్లాట్ చేసేస్తుంటే, ఆయన భార్య నమ్రత ఫీలింగ్ ఎలా ఉందో మరి..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com