
తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించడం, కొద్ది పేరు రాగానే, బాలీవుడ్ కు వెళ్లిపోయి తెలుగు చిత్రసీమను అవమానపర్చడం, చాలా మంది హీరోయిన్లకు అలవాటైన పనే ఇది. ఈ లిస్ట్ లో రాథికా ఆప్టే పేరు కూడా ఉంది. తెలుగులో రక్తచరిత్ర, లెజండ్, లయన్ సినిమాలు చేసిన ఈ భామ, ఆ తర్వాత హిందీ సినిమాల్లో బిజీ అయిపోయింది. అక్కడకు వెళ్లిన తర్వాత, సౌత్ లో హీరోయిన్లను చాలా చిన్న చూపు చూస్తారు. నాకు అసలు గౌరవం లభించలేదు అని డైలాగ్స్ వేసింది. ఆమె చేసిన మూడు సౌత్ సినిమాల్లో రెండు బాలయ్యవే కావడం విశేషం. అది జరిగిపోయిన కథ. ఇక లేటెస్ట్ గా కబాలీ లో నటించిన ఈ భామ మరోసారి కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ ఇచ్చింది. కబాలీ షూటింగ్ లో నన్ను హీరోతో సమానంగా చూశారు. గతంలో చేసిన కొన్ని సౌత్ సినిమాల్లో చాలా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. ఇక లైఫ్ లో సౌత్ సినిమాలు చేయకూడదనుకున్నాను కానీ, రజనీ సార్ సినిమా కాబట్టి చేశాను. షూటింగ్ టైంలో, నన్ను కూడా ఆయనతో సమానంగా ట్రీట్ చేశారు అంటూ మళ్లీ ఇన్ డైరెక్ట్ గా బాలయ్యపై కౌంటర్లు వేసింది. అవకాశాలు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని చేసేయడం, ఆ తర్వాత వేస్ట్ అంటూ మాట్లాడటం..టాలీవుడ్ పై వీళ్ల ఒపీనియన్ ఏంటో మరి...!






