Home

»

Latest News

పెళ్ల‌య్యాక ప్రేమే `మ‌జిలి`

Apr 1, 2019 1:08PM

 

అందం, అభిన‌యం క‌ల‌గ‌లిస‌న న‌టి స‌మంత‌. ఆమె న‌ట‌న మాత్ర‌మే కాదు, మాట‌లు కూడా చాలా బావుంటాయి. ఆదివారం జ‌రిగిన `మ‌జిలి`  ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో స‌మంత మాట్లాడుతూ..`` ప్రేమను అనుభ‌వించ‌క ముందు ..అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని చాలా ఊహించుకుంటాం. కానీ, నిజం వేరుగా ఉంటుంది. ప్ర‌తి ల‌వ్ స్టోరి యూనిక్ గా ఉంటుంది. మ‌జిలీ నిజ‌మైన ప్రేమ‌కథా చిత్రం. ల‌వ్ అంటే బ‌లం, ల‌వ్ అంటే ధైర్యం, ప్రేమంటే బాధ్య‌త. ఏమాయ చేసావే, మ‌నం త‌ర్వాత మ‌జిలీ కూడా నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా న‌మ్ముతున్నా. పెళ్ల‌య్యాక ప్రేమ గురించి సినిమాలు ఎందుకు చేయ‌రు అనుకుంటున‌న త‌రుణంలో ద‌ర్శ‌క‌డు శివ ఈ స్టోరీతో వ‌చ్చారు.  అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. ఈ నెల 5న థియేట‌ర్ల‌లో క‌లుస్తాను `` అంటూ త‌న‌దైన శైలిలో మాట్లాడి అందిర్నీ ఆక‌ట్టుకంది స‌మంత‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com