
ప్రస్తుతం నాని `జెర్సీ` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది తన 23వ చిత్రం కాగా, తన 24 వ చిత్రం `గ్యాంగ్ లీడర్` కె.విక్రమ్ కుమార్ దర్శత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే నాని ని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలో తన 25 వ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రం తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు నాని.
తన 25 వ సినిమాకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో పూర్తి స్థాయి కథానాయకుడి పాత్ర కాకుండా ఓ డిఫరెంట్ రోల్ లో నాని కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో హీరో సుధీర్ బాబు కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడని వినికిడి. మరి ఈ చిత్రానికి `వ్యూహం` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తాజా వార్తలు. దిల్ రాజు నిర్మణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరి నాని `వ్యూహం` ఎంత వరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే మరి.






