Home

»

Latest News

సైలెంట్ గా రొమాన్స్ చేసారుః నాగ్

Apr 1, 2019 12:17PM

 

పెళ్లి త‌ర్వాత చైతు, స్యామ్ జంట‌గా న‌టించిన చిత్రం `మ‌జిలి`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం  ఏ ప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఆదివారం జ‌రుపుకున్న ప్రీ -రిలీజ్ కార్య‌క్ర‌మంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..``చైతు, శ్యామ్ `ఏమాయ చేసావే` సినిమా చూసిప్పుడు చాలా చ‌క్క‌టి జంట అనుకున్నా. `మ‌నం` సినిమాలో వీళ్లిద్ద‌రూ నాతో క‌లిసి న‌టించారు. వీరిద్ద‌రు ఇలా ల‌వ్ చేసుకుంటున్నార‌ని నాకు తెలియ‌దు. ఇద్ద‌రు నాకు ఏమాత్రం తెలియ‌కుండా సైలెన్స్ గా రొమాన్స్ చేస్తున్నార‌ని తెలిసింది. స‌మంత ఒక రోజు నేనున్న‌ప్పుడు తొలిసారి మా ఇంటికి వ‌చ్చింది. మా కుక్క పరుగెత్తుకుంటూ స‌మంత ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అరె...దీనికి సమంత ఎలా తెలుసు...అని అడిగాను. అప్పుడు చెప్పింది...` మామ నాకు లియో ఎప్ప‌టి నుంచో తెలుసు అని.
మ‌జిలి సినిమా టీజ‌ర్ చూసిన‌ప్పుడు కాస్త జివ్వుమంది. బాధ క‌లిగింది.  `వెధ‌వ‌ల‌కు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు` అనేది లాస్ట్ మాట‌. తండ్రిగా నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. బ‌ట్ నేను చెప్పేది సినిమా చూడ‌క‌ముందు...కానీ సినిమా చూసిన త‌ర్వాత మా మంచి అబ్బాయికీ, మంచి అమ్మాయి దొరికింది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ట్రైల‌ర్ చూస్తుంటూ నాకు రెండు సార్లు క‌ళ్లల్లో  నీళ్లోచ్చాయి`` అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com