సమంత బికినీపై చైతూకి నాగ్ క్లాస్..?
on Dec 31, 2016
టాలీవుడ్ లవ్‌బర్డ్స్ నాగచైతన్య, సమంతల ప్రేమకు పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ స్వేచ్చగా తిరుగుతున్నారు. హాలీడ్ ట్రిప్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటూ విదేశాల్లో చక్కర్లు కొడుతోంది ఈ జంట..సర్లే త్వరలో పెళ్లి చేసుకోబోయేవారు ఆ మాత్రం జాలీగా గడిపితే తప్పేముందిలే అని వీరిని చూసిచూడనట్లు వదిలేస్తుంటే వారిద్దరూ మాత్రం హద్దులు దాటి తిరుగుతుండటం..నలుగురు నానా మాటలు అంటుండటంతో నాగార్జున సీరియస్ అయ్యారు. దానికి తోడు ఇటీవల క్రిస్మస్ వేడుకలు అంటూ సమంత ఇచ్చిన హాట్ బికినీ షో టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం తెలిసిన నాగార్జున ఇద్దరిని పిలిచి ఫుల్ క్లాస్ పీకాడట. మరీ ముఖ్యంగా సమంతనైతే దుమ్ము దులిపేశాడట. అక్కినేని కుటుంబానికి కాబోతున్న కోడలు కాస్త పద్దతిగా ఉండాల్సిన అవసరం ఉందని నాగ్ మందలించాడట. ఈ పరిణామాల నేపథ్యంలో అఖిల్ పెళ్లి కంటే ముందే చైతూ-సమంతల పెళ్లి చేయాలని భావిస్తున్నాడట కింగ్.