పవన్ పంచె వెనుక గుట్టు ఇదే..?
on Dec 31, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత అభిమానులకు అదిరిపోయే హిట్ ఇవ్వాలని డిసైడయ్యాడు పవన్ కళ్యాణ్. దీనిలో భాగంగా డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చేస్తున్నాడు. సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో పాటు అభిమానులను అలరించేందుకని మూవీ పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది చిత్రయూనిట్. దీపావళికి ఆ తర్వాత వచ్చిన పోస్టర్స్ పద్ధతిగా బాగానే ఉన్నాయి..కానీ రీసెంట్గా న్యూఇయర్ గిఫ్ట్‌గా విడుదల చేసిన ఫ్రీ-లుక్ పోస్టర్స్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతసేపు పవర్‌స్టార్ కాళ్లని వెనుక నుంచి, ముందు నుంచి..చూపించడం తప్పించి ముఖం చూపించరా..కాళ్ల కోసం ఇలా ఎన్ని పోస్టర్స్‌ని విడుదల చేసుకుంటూ పోతారు అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు పవన్ అభిమానులు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు చిత్ర నిర్మాత శరత్ మరార్. కాటమరాయుడులో పంచెకట్టు అనేది ముఖ్యమైన లుక్..ఇంతకాలం పవన్‌ని మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో చూసిన జనం పంచెకట్టులో ఆయన్ను చూసేందుకు అలవాటు పడటానికే ఇలా చేశామన్నారు.