విడాకుల తర్వాత చనిపోతాననుకున్నా!
on Dec 7, 2021
టాలీవుడ్ బెస్ట్ పెయిర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత అనూహ్యంగా విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే విడాకుల తర్వాత సమంతపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ఆ ట్రోల్స్ తో ఏ మాత్రం కృంగిపోని సమంత.. కెరీర్ పై మరింత దృష్టి పెడుతూ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే తాజాగా విడాకుల అంశంపై స్పందించిన సమంత.. ఆ సమయంలో చనిపోతాను అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: 'యశోద'గా మారిన సమంత!
తాజాగా ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. "నిజానికి నేను చాలా బలహీనురాలిని అని అనుకుంటాను. చైతూతో విడిపోయిన తర్వాత కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉండగలనని అనుకోలేదు. నా వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఇంత బలంగా ఎదుర్కోవడం చూసి నాకే ఆశ్చర్యమేస్తోంది. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు" అని సమంత చెప్పుకొచ్చింది.
Also Read: సామ్.. బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్!
సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్సకత్వంలో సమంత నటించిన 'శాకుంతలం' త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం 'యశోద' అనే పాన్ ఇండియా మూవీతో పాటు 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో సమంత నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
