చైతూతో విడాకుల పోస్ట్‌ను తొలగించిన సామ్.. ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?
on Jan 21, 2022
ఆమధ్య సోషల్ మీడియా ద్వారా తాము విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు నాగచైతన్య, సమంత రూత్ ప్రభు. 2021 అక్టోబర్ 2న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో తాము విడిపోతున్నామని ఆ ఇద్దరూ ప్రకటించారు. అప్పట్నుంచీ వారి సోషల్ మీడియా యాక్టివిటీస్‌ను ఫ్యాన్స్ నిశితంగా గమనిస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా నాగచైతన్యతో తాను విడిపోతున్నట్లు ప్రకటించిన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి తొలగించి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది సమంత.
Also read: 'గుడుంబా శంకర్' హీరోయిన్ రి-ఎంట్రీ!
అదివరకు తాము విడాకులు తీసుకోబోతున్నట్లు వెల్లడించాక, ఇన్‌స్టాగ్రామ్ నుంచి చైతూతో తాను కలిసున్న దాదాపు అన్ని ఫొటోలను సామ్ డిలీట్ చేసింది. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలతో పాటు, చైతూతో గడిపిన హాలిడేస్‌కు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె తొలగించింది. వాటిలో స్పెయిన్, ఆమ్‌స్టర్‌డామ్ విహారయాత్రలు, రానా పెళ్లిలో పాల్గొన్న ఫొటోలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ నాటి ఫొటోలు కూడా ఉన్నాయి.
Also read: 'బంగార్రాజు' విజయం వెనుక సీఎం జగన్ ఉన్నారు!
అంతకుముందు నాగచైతన్యతో పిల్లల్ని కని తన కుటుంబాన్ని మొదలుపెట్టాలని సమంత అనుకున్నదని 'శాకుంతలం' నిర్మాత నీలిమ గుణ వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది. 'శాకుంతలం' సినిమాని సమంతకు ఆఫర్ చేసినప్పుడు, మొదట ఆమె తిరస్కరించిందనీ, చైతన్యతో కలిసి ఫ్యామిలీని ప్రారంభించాలని ఆమె అనుకోవడమే దానికి కారణమనీ ఆమె చెప్పింది. ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఆలోచనలో పడేస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి చైతూతో విడిపోతున్నట్లు ప్రకటించిన పోస్ట్‌ను సమంత తొలగించింది. చూద్దాం.. రానున్న రోజుల్లో మరిన్ని ఆశ్చర్యపరిచే సందర్భాలు మనకు ఎదురవుతాయేమో!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
