ఈసారి సమంత బర్త్ డే వేడుకలు ఎక్కడో తెలుసా?
on Apr 24, 2023

స్మార్ట్ గర్ల్ సమంత ఈ మధ్య నాన్‌స్టాప్‌గా వార్తల్లో ఉంటున్నారు. నాన్‌స్టాప్‌గా అటూ ఇటూ బిజీ బిజీగా తిరుగుతున్నారు. మరి ఇంత బిజీలో ఆమె పుట్టినరోజు షాపింగ్ చేసేశారా? అరె... అవును కదా! సమంత పుట్టినరోజు ఏప్రిల్ 28నే కదా అని గుర్తుకొచ్చేసిందా మీకూ. అవునండీ. ఈ ఏప్రిల్ 28కి సమంతకు 36 ఏళ్లు నిండుతాయి. ఈ ఏడాది పుట్టినరోజున సమంత ఎక్కడుంటారని ఆరాతీస్తే, ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆమె సిటాడెల్ కొత్త షెడ్యూల్లో నటిస్తూ బిజీగా ఉంటారు. ఓ వైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా పట్టించుకోకుండా, పోరాటం చేస్తున్నారు సమంత. ఎప్పటికప్పుడు తనకి తానే స్ఫూర్తి పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
గత ఏడాది కూడా సమంత పుట్టినరోజు షూటింగ్‌లోనే జరిగింది. లాస్ట్ టైమ్ కశ్మీర్‌లో ఉన్నారు సమంత. ఖుషి షూటింగ్‌లో. ఖుషి టీమ్అంతా ఓ సీన్ ని ప్లాన్ చేశారు. అది నిజమైన సీన్ అనుకుని యాక్ట్ చేయడంలో నిమగ్నమయ్యారు సమంత. తీరా చూడబోతే అది ప్రాంక్. సమంతకు పుట్టినరోజు విషెస్ చెప్పడంకోసమే టీమ్ అంతా మేలుకుని ఉన్నారని తెలిసి ఆనందభాష్పాల్లో మునిగిపోయారు సమంత. మరి ఈ ఏడాది సిటాడెల్ టీమ్, రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్ కలిసి సమంతకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సమంత నటించిన శాకుంతలం ఇటీవలే విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సమంత, రీసెంట్గా లండన్‌లో సిటాడెల్ గ్లోబల్ ప్రీమియర్‌కి హాజరయ్యారు. ఈ ఏడాది ఆమె ఓ వైపు సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేయాలి. మరోవైపు ఖుషి షూటింగ్ కంప్లీట్ చేయాలి. కొన్నిసార్లు ఒకే రోజులో రెండు షూటింగులకు కూడా హాజరయ్యేలా కాల్షీట్ అడ్జస్ట్ చేస్తున్నారట సమంత. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కాగానే ఫ్యామిలీమేన్3కి కూడా రెడీ కావాల్సి ఉంటుంది సామ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



