Home

»

Latest News

టికెట్లు అమ్మేశాక హ్యాండ్ ఇచ్చిన సమంత, తమన్నా..!

Jun 30, 2016 11:16AM

హీరోయిన్ అయ్యాక సినిమాల ద్వారా సంపాదించేదానికంటే.. ఆ హోదాలో షాపింగ్ మాల్స్ ఓపెనింగులు, ప్రైవేట్ ఫంక్షన్లకు హాజరవుతూ సంపాదించేదే ఎక్కువ. అందుకే షూటింగ్ మధ్యలో ఏమాత్రం గ్యాప్ దొరికినా అమెరికా, ఆస్ట్రేలియాలో నిర్వహించే ఫంక్షలను చెక్కేస్తుంటారు మన అందాల భామలు. అక్కడవారికి రాచమర్యాదలతోపాటు డాలర్లు కూడా బాగా దొరుకుతాయి. అయితే.. సమంత మాత్రం కాలిఫోర్నియాలో జరగుతున్న "ATA" వేడుకలకు మాత్రం వెళ్లకుండా హ్యాండ్ ఇచ్చిందని తెలుస్తోంది. అడ్వాన్స్ పేమెంట్ మొదలుకొని ఫ్లైట్ టికెట్స్ సహా అన్నీ బుక్ చేయబడిన తర్వాత "సారీ నాకు కుదరడం లేదు" అంటూ సింపుల్ గా ఒక ట్వీట్ పెట్టి ఊరుకొంది. ఆమెతోపాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా "నేను కూడా రాలేను" అంటూ ట్వీటేసింది. అక్కడ సమంత, తమన్నాలు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారని "ATA" వారు ఏకంగా పత్రికా ప్రకటనలు ఇచ్చేసుకొని టికెట్లు అమ్మేశారు. ఇప్పుడు సమంత, తమన్నాలు గైర్హాజరావుతుండడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు నిర్వాహకులు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com