Home

»

Latest News

నాయుడు కోరిక తీరుస్తున్న రాణా...!

Jun 30, 2016 11:23AM

మూవీ మొఘల్ రామానాయుడు గారికి తీరని కోరికలు రెండు.. "రాముడు భీముడు" సినిమాను జూ.ఎన్టీయార్ తో రీమేక్ చేయడం ఒకటైతే, తన కుటుంబం మొత్తం కలిసి "మనం" లాంటి ఒక సినిమాలో నటించడం మరొకటి. గిన్నీస్ రికార్డ్ కూడా ఎక్కేసిన రామానాయుడికి తీరని కోరికలైన ఈ రెండిట్లో మొదటిదైన "రాముడు భీముడు" రీమేక్ ను నెరవేర్చేందుకు ఆయన తనయుడు సురేష్ బాబు నడుం బిగించగా.. రెండో కోరికను మనవడు రాణా తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. బాబాయ్ వెంకటేష్, తమ్ముడు అభిరామ్ లతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు కథలు వింటున్నాడట. ఇప్పటివరకూ ఒక్క కథ కూడా నచ్చలేదని, త్వరలోనే "మనం" లాంటి ఒక సినిమా తప్పకుండా చేస్తానని చెప్పాడు రాణా!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com